HomeTelugu Trendingవివేక్ రంజన్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ది వాక్సినేషన్‌ వార్'

వివేక్ రంజన్ అగ్నిహోత్రి కొత్త సినిమా ‘ది వాక్సినేషన్‌ వార్’

Vivek Ranjan Agnihotri new
బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్‌ సినిమాతో మంచి బ్రేక్‌ అందుకున్నాడు. ది కశ్మీర్ ఫైల్స్‌ ను తెరకెక్కించిన నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాడు వివేక్‌ అగ్నిహోత్రి. The War టైటిల్‌ మధ్యలో ఉన్న పదాన్ని పూరించి.. సినిమా పేరేంటో చెప్పగలరా ..? అంటూ ఇప్పటికే వివేక్‌ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

కాగా వివేక్‌ అగ్నిహోత్రి అండ్ టీం ఈరోజు మూవీ టైటిల్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెర దించింది. ఈ చిత్రానికి ది వాక్సినేషన్‌ వార్ #TheVaccineWar టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అంతేకాదు ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళంతోపాటు మరో 8 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం 2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.

మీకు తెలియని, మీరు పోరాడి గెలిచిన యుద్దం.. అంటూ టైటిల్‌ లుక్‌లో రాసిన లైన్‌ ఈ సినిమా కరోనా సంక్షోభం, వాక్సినేషన్‌ నేపథ్యంలో రాబోతున్నట్టు చెబుతోంది. ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌లో పల్లవి జోషి తెరకెక్కిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu