శర్వానంద్‌ .. ‘రణరంగం’ టీజర్‌ రెడీ

యంగ్‌ హీరో శర్వానంద్‌ తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘రణరంగం’ షూటింగ్‌లో తిరిగి పాల్గొనడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ’96’ సినిమా చిత్రీక‌ర‌ణ‌ జరుగుతుండగా స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్న స‌మయంలో శ‌ర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. సరైన దిశలో ల్యాండ్‌ అవ్వని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భుజం భాగంలోని ఎముక డిస్‌లొకేట్ కావడంతో డాక్టర్‌ గురవారెడ్డి ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గురవారెడ్డి, డాక్టర్‌ ఆదర్శ్‌లతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వారికి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానని అన్నారు.

ఇక సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న సిరిబా ‘రణరంగం’ దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీని మాత్రం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 4.05గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు సుధీర్‌వర్మ ప్రకటించారు. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.