HomeTelugu Newsన‌వీన్ చంద్ర 'భానుమ‌తి రామ‌కృష్ణ'‌

న‌వీన్ చంద్ర ‘భానుమ‌తి రామ‌కృష్ణ’‌

10 22
యంగ్‌ హీరో న‌వీన్ చంద్ర తాజా చిత్రం’భానుమ‌తి రామ‌కృష్ణ’‌. ఈ సినిమాలో న‌వీన్ స‌ర‌స‌న స‌లోని లూత్రా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్ ఫిల్మ్ గా భానుమ‌తి రామ‌కృష్ఱ రూపొందించ‌డం జ‌రిగింది. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్ కు ఆన్ లైన్ లో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ముప్పై ఏళ్లు దాటిన ఓ యువ‌తి యువ‌కుడు మ‌ధ్య జ‌రిగే ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ సినిమాకు ముఖ్య క‌థాంశ్యమ‌ని ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ నాగోతి తెలిపారు. ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ గా డిజిటిల్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే రీతిలో ఈ సినిమా సాగిపోతుంద‌ని నిర్మాత య‌శ్వంత్ ముల‌కుట్ల అన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని య‌శ్వంత్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu