భానుమతి & రామకృష్ణ మూవీ రివ్యూ..

క‌రోనా నేప‌థ్యంలో ఓటీటీ వేదిక‌గా విడుదల అయిన మరొక చిత్రం ‘భానుమతి అండ్ రామకృష్ణ’. నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ రొమాంటి లవ్ డ్రామా ‘ఆహా’లో జులై 3న విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం

కథ: జీవితంలో అప్పుడే నిల‌దొక్కుకుంటున్న థ‌ర్టీ ప్ల‌స్ బ్యాచ్ ప్రేమ‌లు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమా క‌థాశం. భానుమతి (సలోని లూత్రా) ఓ ముఫై ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. తన జీవితంలో ప్రేమ విఫ‌ల‌మ‌వ్వ‌డంతో ఈమె…లవ్ మరియు రిలేషన్ పట్ల కాస్త గంద‌ర‌గోళంలో ఉంటుంది. ఈ క్ర‌మంలో తెనాలి నుంచి రామకృష్ణ(నవీన్ చంద్ర) ఉద్యోగ బ‌దిలీపై హైదరాబాద్ వస్తాడు. భానుమతి పనిచేసే కంపెనీలో ఆమెకు అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. తొలుత‌ రామకృష్ణను పెద్ద ఇష్టపడని భానుమతి క్రమేణా అంతని ప్రేమలో పడుతుంది. రెండు భిన్న నేప‌థ్యాలు, మనస్థత్వాలు కలిగిన ఈ ఇరువురి ప్రేమ ప్ర‌యాణమే ఈ సినిమాలోని సారాంశం…

నటీనటులు: ప్రధాన పాత్రల్లో నటించిన నవీన్ చంద్ర, సలోనీ ఇద్దరూ పోటా పోటిగా నటించారు. ఆమె లుక్‌ ఈ చిత్రంలో నిజంగానే కాస్తంత వయస్సు ఎక్కువగా కనిపించింది. నవీన్ చంద్ర తనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. సలోనికి ఇది మొదటి తెలుగు సినిమానే అయినా చాలా బాగా నటించింది.

విశ్లేషణ: “హ్యాపీనెస్ అందరికీ ఒకటే కాదు… ఒక్కొక్కరికీ ఒక్కోటి… నా హ్యాపీనెస్ ఏమిటో రామకృష్ణ ఒక్కడికే తెలుసు. ఇప్పుడు నేను వెళ్తోంది వాడి కోసం కాదు నా కోసం…” అన్న ఒక్క డైలాగుతో హీరోయిన్ మనస్సులో ఉన్న భావనను తేల్చి చెప్పేసిన డైరక్టర్ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఈ జనరేషన్ వారు ఎదురుగానే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటే… దాన్ని చూస్తూ చివరకు ఐలవ్యూ కూడా చెప్పుకోవటానికి మనస్సులోనే మొహమాటపడిపోయే జంటను మన ముందుంచటం గొప్ప విషయమే. అక్కడే డైరెక్టర్‌ మార్కులు వేయించేసుకుంటారు. రకరకాల కారణాలతో పెళ్లి లేటు అవుతున్న చాలా మంది కుర్రాళ్లు, అమ్మాయిలు గుర్తుకోచే స్టోరీ లైన్ ఇది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలు చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశాడు దర్శకుడు. దాంతో ఎక్కడా బోర్ కొట్టాదు. అయితే డైరెక్టర్‌ భానుమతి పాత్రను డిజైన్ చేసినంతగా హీరో రామకృష్ణను ఎలివేట్ చేయలేకపోయారు. సినిమా మొత్తం ఒకే విధంగా సాగింది అని చెప్పాలి. వినోదం ఇంకాస్త జోడిస్తే సినిమా మ‌రికొన్ని వ‌ర్గాలకు చేరువ‌య్యేది. ప్లాట్ కూడా అందిరికీ క‌నెక్ట్ అయ్యేది కాదు. ఇక ప్లీ క్లైమాక్స్ లో ఎమోష‌నల్ క‌నెక్టివిటీ తెగిపోయిన ఫీలింగ్ వ‌స్తుంది.

హైలైట్స్‌: నటీనటుల నటన

డ్రాబ్యాక్స్: ప్లీ క్లైమాక్స్

టైటిల్ : భానుమతి & రామకృష్ణ
నటీనటులు: నవీన్‌ చంద్ర, సలోని లుత్రా, రాజా చెంబోలు, వైవా హర్ష
రచన, దర్శకత్వం : శ్రీకాంత్‌ నాగోతి
నిర్మాత : యశ్వంత్‌ ములుకుట్ల

సంగీతం : శ్రవణ్‌ భరద్వాజ్‌, అచ్చు రాజమణి (నేపథ్య సంగీతం)

చివరిగా : అందమైన ప్రేమకథ
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates