HomeTelugu Newsనయనతార 'అన్నపూరణి' ఫస్ట్‌ గ్లింప్స్‌

నయనతార ‘అన్నపూరణి’ ఫస్ట్‌ గ్లింప్స్‌

nayanathara new movie glimp 1

లేడి సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ మ‌రో సినిమా అనౌన్స్ చేసింది. నీలేష్ కృష్ణ అనే కొత్త దర్శకుడితో తన 75వ చిత్రం చేస్తుంది. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. దసరా పండగా సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ వివరాలు మేక‌ర్స్ వెల్లడించారు. దీనితో పాటు టైటిల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ‘అన్నపూరణి’ అనే టైటిల్‌ను మేక‌ర్స్ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ చూస్తే.. సంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా నయనతార ఇందులో కనిపిస్తుంది.

ఫ్యామిలీ అంతా పూజా కార్య‌క్ర‌మాల‌తో నిమ‌గ్న‌మై ఉంటే.. నయన్ చ‌దువుకుంటున్న‌ట్లు బిల్డ‌ప్ ఇస్తూ.. చికెన్ కాబాబ్‌ల‌ను తినాల‌ని ఆశగా చూస్తున్నట్లు ఉంది. ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu