HomeTelugu Trendingఅమ్మవారి గెటప్‌లో నయనతార

అమ్మవారి గెటప్‌లో నయనతార

1
లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్‌ హీరోగా లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూంది.. లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో భాగంగా.. నయన్.. తమిళ్‌లో ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’… వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బాపు చిత్రం, బాలయ్య సరసన ‘శ్రీరామరాజ్యం’ లో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అనేలా యాక్ట్ చేసిందీ బ్యూటీ. ఇప్పుడు తమిళ సినిమా ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాలో నయన్‌ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతుంది. ఈ చిత్రం (Mookuthi Amman first look) ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నయన్‌ అమ్మవారి రూపంలో కనిపించి, ఆకట్టుకుంటోంది. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu