HomeTelugu Trendingస్టార్‌ హీరోయిన్‌కి తల్లిగా నయనతార..

స్టార్‌ హీరోయిన్‌కి తల్లిగా నయనతార..

nayanthara play mother role

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శివ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘అన్నాత్తే’’. ఇందులో కుష్బూ, మీనా, నయన తార, కీర్తీ సురేష్‌.. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న చిత్రంలో కీర్తి సురేష్, నయన్‌ పాత్రల గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నయనతారకు కీర్తి సురేష్ కూతురు పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. గతంలో నయన్ తల్లి పాత్రలో నటించలేదు. ఇదిలా ఉంటే మొదట్లో ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ప్లాన్‌ చేశారు. అయితే, కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న పరిస్థితుల దృష్ట్యా పక్క రాష్ట్రంలో ఎక్కువ శాతం షూటింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదని చిత్రం యూనిట్ భావిస్తోంది చాలా రిస్క్‌ తో కూడుకున్నదని, చెన్నైలోనే ఓ భారీ సెట్‌ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలిని అని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది మూవీ యూనిట్‌.

nayanthara mother role

Recent Articles English

Gallery

Recent Articles Telugu