HomeTelugu Trendingబాలీవుడ్‌లో 'నీరజ్ చోప్రా' బయోపిక్‌

బాలీవుడ్‌లో ‘నీరజ్ చోప్రా’ బయోపిక్‌

Neeraj chopra Biopic in bol

ఒలింపిక్స్ ఇండియాకు అథ్లెటిక్స్ లో బంగారు పతకం అందించాడు నీరజ్ చోప్రా. ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ 140 కోట్ల మంది అంచనాలు నిలబెడుతూ బంగారంను దక్కించుకున్న నీరజ్ చోప్రా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఈమద్య కాలంలో క్రీడాకారుల బయోపిక్ లు రూపొందుతున్నాయి. క్రికెటర్లు మరియు ఇతర క్రీడలకు సంబంధించిన ఆటగాళ్ల బయోపిక్ మాత్రమే కాకుండా ప్రముఖుల బయోపిక్ లు వరుసగా తెరకెక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో నీరజ్ చోప్రా బయోపిక్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ బయోపిక్ ను చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడు అనేది వినికిడి. అయితే నీరజ్ చోప్రా బయోపిక్ పై రణదీప్ హుడా పేరు కూడా వినిపిస్తుంది.

కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా మాట్లాడుతూ తన బయోపిక్ ను చేయాలంటే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లేదా నీరజ్ చోప్రా చేయాలని వ్యాఖ్యలు చేశాడట. ఇప్పుడు నీరజ్ బంగారు పతక విజేత కనుక బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలు హీరోలు కూడా బయోపిక్ కు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కాకున్నా కాస్త సమయం పట్టినా కూడా ఈ సినిమా మాత్రం పట్టాలు చేయడం మాత్రం ఖారారు అన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే నీరజ్ చోప్రాకు సంబంధించిన బయోపిక్ పై ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి

Recent Articles English

Gallery

Recent Articles Telugu