HomeTelugu Trendingకోలివుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ధోనీ....

కోలివుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ధోనీ….

dhoni
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. భారత కెప్టెన్‌‌గా ఎన్నో విజయాలందించి విశేష అభిమాన గణాన్ని అందుకున్న ధోనీకి.. తమిళనాడు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే కోలివుడ్‌లోకి ధోనీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా నయనతార ప్రధాన పాత్రలో  తమిళంలో నిర్మించబోయే ఒక సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. లేడీ ఓరియంటెడ్‌ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాకు ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.

ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో  అట్లీ దర్శకత్వంలో సెట్స్‌పై ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చే అవకాశమున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి క్రికెటర్ గా సక్సెస్ అయిన ధోని.. నిర్మాత గా ఏ  మేరకు విజయం సాధిస్తాడో  వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu