HomeTelugu Big StoriesNani: రికార్డు సృష్టించిన నేచురల్ స్టార్ నాని

Nani: రికార్డు సృష్టించిన నేచురల్ స్టార్ నాని

Netflix bagged nani starrer
Nani: నేచురల్ స్టార్ నాని గతేడాది దసరాట, ‘హాయ్ నాన్న’ మూవీలతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ‘అంటే సుందరానికి’ మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది.

ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. లేటెస్ట్ సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పార్ట్ చాలావరకు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. వీటికి భారీస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది.

నాని ‘సరిపోదా శనివారం’ మూవీకి సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 45 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. నాని సినిమాల్లో ఇప్పటి వరకూ డిజిటల్ రైట్స్ అత్యధిక ధర పలికిన మూవీ ఇదే అని చెప్పొచ్చు.

సరిపోదా శనివారం మూవీలో ఎస్‌జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు

Recent Articles English

Gallery

Recent Articles Telugu