HomeTelugu Trendingవాల్తేరు వీరయ్య: కొత్త పోస్టర్‌ విడుదల

వాల్తేరు వీరయ్య: కొత్త పోస్టర్‌ విడుదల

new Avatar of our Megastarమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. యంగ్‌ డైరెక్టర్‌ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి ‘ముఠామేస్త్రి’ తరహాలో మాస్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాక ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా (జనవరి 13న) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్ తో పాటు రవితేజ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ కూడా నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా దర్శకుడు బాబీ.. చిత్రం నుంచి మరో పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో చిరంజీవి ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిరిపోయింది.

ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ పేర్కొన్నారు. శృతి హాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి మరియు శృతి హాసన్లపై యూరప్లో చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీంతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాని కూడా ఈ సంస్థే నిర్మిస్తుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కానుంది. దీంతో ఈ రెండు ఈ సినిమాలపై పోటీ మొదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu