HomeTelugu Trendingబాలయ్యకు జంటగా కొత్త హీరోయిన్‌!

బాలయ్యకు జంటగా కొత్త హీరోయిన్‌!

4 14
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడోవ చిత్రం ఇది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శ్రియ – అంజలి హీరోయిన్‌లుగా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ బాలకృష్ణ జోడీగా ఒక కొత్త హీరోయిన్ కనిపించనుందంటూ తాజాగా బోయపాటి చెప్పాడు.

బాలకృష్ణ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్లను అనుకుంటున్నామనీ, అందులో ఒకరి పేరును సరైన సమయం చూసి ప్రకటిస్తామని అన్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్స్ దొరక్క తాము చాలా ఇబ్బందులు పడినట్టుగా వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ఈ సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ ను ఎంపిక చెప్పిన దర్శకుడు.. శ్రియ – అంజలి ఉన్నారా లేరా అనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu