HomeTelugu Trending''నో పెళ్లి'' అంటున్న సాయి ధరమ్‌ తేజ్‌

”నో పెళ్లి” అంటున్న సాయి ధరమ్‌ తేజ్‌

2 242 24టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి, ప్రతిరోజు పండగ’ వంటి విజయాలు అందుకున్నాడు. తాజాగా దేవకట్టా డైరెక్షన్‌లో ”సోలో బ్రతుకే సో బెటర్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నివేదా పేతు రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ రోజు ఈ మూవీ నుండి ఓ పాట విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ”నో పెళ్లి” అంటూ పెళ్లి వల్ల వచ్చే కష్టాలను వివరిస్తున్నాడు తేజ్‌. ఈ పాట యువతను .. బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటలో మరో ఇద్దరు హీరోలు వరుణ్ తేజ్ మరియు రానా తో పాటుగా ఇస్మార్ట్ భామ నభా నటేష్ కూడా కనిపిస్తుంది. అయితే ఇదివరకూ తేజ్ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. భగవాన్ మరియు జె.పుల్లారావు కలిసి సంయుక్తన్గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu