HomeTelugu Big Storiesన్యూ ఇయర్‌.. స్పెషల్‌ పోస్టర్స్‌.‌!

న్యూ ఇయర్‌.. స్పెషల్‌ పోస్టర్స్‌.‌!

6
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సినీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అభిమానులకు కొత్త ఏడాది కానుకగా పలు పోస్టర్లను విడుదల చేశాయి ఆయా చిత్ర బృందాలు. కొత్త స్టిల్స్‌, పోస్టర్లు అభిమానులకు ట్రీట్‌గా మారాయి.

సరిలేరు నీకెవ్వరు
సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఇయర్‌ విషెస్‌ తెలుపుతూ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మహేష్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో అలనాటి నటి విజయశాంతి కీలకపాత్రను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిస్కోరాజా
హీరో రవితేజ నోటిలో చుట్టపెట్టుకుని మాస్‌ అవతారంలో ముందుకొచ్చారు. ఆయన నటిస్తున్న సినిమా ‘డిస్కోరాజా’. వి. ఆనంద్‌ దర్శకుడు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. సీఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అందరికీ హ్యాపీ న్యూఇయర్‌ చెబుతూ ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

6b

అల.. వైకుంఠపురములో
అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది. న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఎంత మంచివాడవురా..
కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎంత మంచివాడవురా!’. వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌. శ్రీదేవి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

‘అశ్వథ్థామ’
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ హీరోయిన్‌. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉషా మల్పూరి నిర్మాత. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

6a

Recent Articles English

Gallery

Recent Articles Telugu