HomeTelugu Trendingన్యూయర్‌కి రవితేజ 'క్రాక్‌' ట్రైలర్‌

న్యూయర్‌కి రవితేజ ‘క్రాక్‌’ ట్రైలర్‌

Krack movie trailer release

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. ఈ షూటింగ్ పాట‌ల‌తో స‌హా మొత్తం పూర్తయింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న చిత్రాన్ని రిలీజ్‌ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాగా న్యూయర్‌ సందర్భంగా (జ‌న‌వ‌రి 1)న చిత్ర బృందం థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను విడుదల
చేయ‌నుంది.

ట్రైల‌ర్ రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ పోస్టర్‌‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర బృందం. ర‌వితేజ, శ్రుతిహాస‌న్ హుషారుగా ఓ పాట‌లో డాన్స్ చేస్తూ పోస్టర్‌లో క‌నిపిస్తున్నారు. ర‌వితేజ బ్లాక్ డ్రెస్‌లో ఎప్పట్లా ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపిస్తుంటే, శ్రుతి అల్ట్రా మోడ‌ర‌న్ లుక్‌లో అల‌రిస్తున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకి అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu