HomeTelugu News'నెక్ట్స్‌ ఏంటి?' ట్రెండ్‌ చేస్తానంటున్న తమన్నా

‘నెక్ట్స్‌ ఏంటి?’ ట్రెండ్‌ చేస్తానంటున్న తమన్నా

9 7సందీప్‌ కిషన్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్ట్స్‌ ఏంటి?’. అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం.. ప్రేమించుకోవడం.. విడిపోవడం.. వారిద్దరి మధ్య నడిచింది ప్రేమనా, రొమాన్సా లేక కామమా ఎవరికి తెలుసు. ఈ అంశంతోనే బాలీవుడ్‌ డైరెక్టర్‌ కునాల్‌ కోహ్లి తెలుగులో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నవదీప్‌, పూనమ్‌ కౌర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్‌ పూరి నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

వరస అపజయలతో సతమతమవుతున్న సందీప్‌ కిషన్‌ ఈ చిత్రంలో ప్లే బాయ్‌ రోల్‌ పోషిస్తుండగా, మిల్క్‌ బ్యూటీ తమన్నా మరోసారి గ్లామరస్‌ రోల్‌తో ఆకట్టుకుంది. నవదీప్‌ ఏజ్డ్‌ రోల్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్య​క్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu