HomeTelugu TrendingTamannaah Bhatia: మిల్కీబ్యూటీకి మహారాష్ట్ర పోలీసుల సమన్లు!

Tamannaah Bhatia: మిల్కీబ్యూటీకి మహారాష్ట్ర పోలీసుల సమన్లు!

Tamannaah BhatiaTamannaah Bhatia: హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‌ లను ఫెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగానూ ఈనెల 29న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్న చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లిందంటూ ప్రసార హక్కులు కలిగిన వయాకమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు నోటీసులు అందించారు. ఐపీఎల్ డిజిట్ల ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఫిర్యాదుతో మహారాష్ట్ర సైబల్ సెల్ ఫెయిర్ ప్లే యాప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేసేందుకే తమన్నా విచారణకు రావాలంటూ ఆమెకు సమన్లు పంపారు పోలీసులు.

ఫెయిర్ ప్లే యాప్ ను ప్రమోట్ చేసిందని.. అందుకే సాక్షిగా విచారణకు పిలిచారని వర్గాలు తెలిపాయి. ఇక ఇదే కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంజయ్ కూడా ఈనెల 23న విచారణకు హాజరు కావాల్సి ఉన్నా ఆయన గైర్హాజయ్యారు. విచారణ రోజున తాను ముంబైలో లేనని పేర్కొన్నారు సంజయ్ దత్.

విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో తేదీని సూచించాలని పోలీసులను కోరారు. ఫెయిర్ ప్లే టాటా ఐపీఎల్ 2023ని చట్టవిరుద్ధంగా ప్రదర్శించిందని.. ఈ కారణంగా తమకు రూ. 100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని వయాకామ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణలో ఫెయిర్ ప్లే వివిధ కంపెనీల ఖాతాల నుంచి నటీనటులకు డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

కురాకోలో ఉన్న వెంచర్ అనే కంపెనీ ఖాతా నుంచి సంజయ్ దత్ డబ్బు అందుకున్నాడు. అలాగే లైకోస్ గ్రూప్ ఎఫ్జెడ్ఎఫ్ కంపెనీ ఖాతా నుంచి బాద్షా డబ్బు అందుకున్నాడు. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా డబ్బు అందుకున్టన్లు తెలుస్తోంది. డిసెంబర్ 2023లో బెట్టింగ్ యాప్ కు చెందిన ఓ ఉద్యోగిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu