HomeTelugu Trendingప్రభాస్‌ సినిమాలో నిధి అగర్వాల్‌!

ప్రభాస్‌ సినిమాలో నిధి అగర్వాల్‌!

Nidhi aggarwal in prabhas m

ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ టాలీవుడ్‌ లో పెద్దగా సినిమాలు లేవు. తమిళంలో కూడా వరుసగా పలు సినిమాలు చేసినప్పటికీ… హీరో శింబుతో లవ్ అఫైర్ అంటూ వచ్చిన వార్తలు ఆమె కెరీర్ పై ప్రభావం చూపాయి. తాజాగా నిధి గురించి ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో పీరియాడిక్ హారర్ కామెడీ మూవీలో నిధి అగర్వాల్‌కు ఛాన్స్‌ వచ్చినట్లు టాక్‌ . హీరోయిన్ గా ఆమె దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే నిధి అగర్వాల్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu