HomeTelugu Big Storiesనాని జులైకి ఫిక్స్ అయ్యాడు!

నాని జులైకి ఫిక్స్ అయ్యాడు!

హీరో నాని వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ‘నిన్నుకోరి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న ‘నిన్నుకోరి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్‌ సాంగ్‌ ‘అడిగా అడిగా.. ఎదలో లయలడిగా’కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.
ఈ చిత్రం గురించి నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ.. ”ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో సినిమా అంతా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఆదితో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ‘నిన్నుకోరి’ నాకు మరో మంచి సినిమా అవుతుంది” అన్నారు.
నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ.. ”నానితో ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్న సినిమా ఇది. కథకు అనుగుణంగా సినిమాలోని ఎక్కువ శాతం షూటింగ్‌ అమెరికాలోనే చెయ్యడం జరిగింది. అలాగే హైదరాబాద్‌, వైజాగ్‌లో కూడా షెడ్యూల్స్‌ చేశాం. టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోపీసుందర్‌ అన్నీ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. వరసగా సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తున్న నానికి ‘నిన్నుకోరి’ మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ మూవీ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7 వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ”ఒక సెన్సిబుల్‌ పాయింట్‌ని తీసుకొని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు మంచి గ్రిప్‌ ఇచ్చింది. నేను అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సహకారంతో షూటింగ్‌ పూర్తి చెయ్యగలిగాం. దానయ్యగారులాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో వర్క్‌ చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగించింది” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu