దిల్ రాజు బ్యానర్ లో నిఖిల్!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస విజయాలను అందుకుంటూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆయనకు మరింత కలిసొచ్చింది. హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు తన బ్యానర్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన యంగ్ హీరో నిఖిల్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. దర్శకుడు చందు మొండేటి-నిఖిల్ కలిసి ‘కార్తికేయ’ అనే సినిమాకు వర్క్ చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది.
ఆ తరువాత వీరిద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు అదే కాంబినేషన్ తో తన బ్యానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. చందు మొండేటి వినిపించిన స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉండడంతో దిల్ రాజు సినిమా చేయడానికి అంగీకరించారు.  వీరిద్దరు తమ తమ ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే దిల్ రాజుతో సినిమా చేయడానికి సిద్ధమవుతారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.