Homeతెలుగు Newsనరకాసుర:' నిన్ను వదలి' సాంగ్‌ విడుదలనరకాసుర:' నిన్ను వదలి' సాంగ్‌ విడుదల

నరకాసుర:’ నిన్ను వదలి’ సాంగ్‌ విడుదలనరకాసుర:’ నిన్ను వదలి’ సాంగ్‌ విడుదల

Ninnu Vadhali song from Nar

‘పలాస 1978’ ఫేం రక్షిత్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. పుష్ప ఫేం శత్రు విల‌న్‌ న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు సెబాస్టియన్ నోహ్ అకోస్టా జూనియర్ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై అజ్జ శ్రీనివాస్, కారుమూరు రఘు
నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మ్యూజిక‌ల్ అప్‌డేట్ ఇచ్చారు.

తాజాగా ఈ మూవీ నుంచి నిన్ను వదలి నేనుండగలనా అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ ని విడుదల చేశారు. ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ పాట‌ను విజయ్ ప్రకాష్, చిన్మయి శ్రీపాద ఆల‌పించ‌గా.. నౌఫల్ రాజా AIS సంగీతం అందించాడు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుద‌ల కానున్న మూవీని విడుద‌ల తేదీకి సంబంధించి త్వర‌లోనే అప్‌డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!