
Ranbir Kapoor Alia Bhatt:
బాలీవుడ్ లో రణబీర్ కపూర్‌కు నటుడిగా మంచి పేరుంది. కానీ సినిమాలు కంటే ఎక్కువగా అతడికి మరో విషయం కోసం ఫేమ్ ఉంది – గాసిప్! ఇండస్ట్రీలో చాలా మంది రణబీర్ గాసిప్ కింగ్ అంటారు. అతడు బాలీవుడ్ లో జరుగుతున్న రూమర్లు, గాసిప్స్ గురించి చాలా అవగాహన కలిగి ఉంటాడు. Koffee With Karan షోలో కూడా చాలామంది సెలబ్రిటీల ఫేవరేట్ గాసిప్ మాస్టర్‌గా రణబీర్ పేరును చెబుతారు.
రన్‌బీర్ కెరీర్ కూడా గాసిప్స్‌కి తగ్గదే. కొన్నేళ్ల క్రితం అతడి రిలేషన్‌షిప్స్, బ్రేకప్‌లు, చీట్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు విపరీతంగా హల్‌చల్ చేశాయి. అప్పట్లో అతడిని ‘కసానోవా’ అని పిలిచేవాళ్లు. కానీ ఇప్పుడు రణబీర్ పూర్తిగా మారిపోయాడు. పెళ్లి అయ్యింది, బిడ్డ కూడా ఉంది. అభిమానులు అతడి ఈ కొత్త క్లీన్ ఫేజ్‌ని చాలా ఇష్టపడుతున్నారు.
కానీ… ఇక్కడే ట్విస్ట్ ఉంది! రణబీర్ భార్య అలియా భట్ మాత్రం తన భర్త గురించి పూర్తిగా భిన్నంగా ఫీల్ అవుతోంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – “రణబీర్ ఎప్పుడూ గాసిప్ చెయ్యడు, ఎవరి గురించి కూడా చెడు మాటలు మాట్లాడడు” అని చెప్పింది.
అలియా మాటలు విని నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. “అలియా సతి సావిత్రిలా తన భర్త గురించి డిఫెండ్ చేస్తోంది” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ రణబీర్ సహనటులు మాత్రం అలియాతో ఏకీభవించలేరు. వాళ్లు బాగా తెలుసు – రణబీర్ ఎప్పుడూ బాలీవుడ్ లోని హాట్ టాపిక్స్ గురించి తెలుసుకోవడంలో ముందుంటాడని.
ALSO READ: విడాకుల గురించి పెళ్లి చేసుకోని Salman Khan ఏమంటున్నారో తెలుసా?