
Arijit Singh Remuneration:
‘‘తుమ్ హీ హో’’, ‘‘చన్నా మేరేయా’’, ‘‘కేసరియా’’, ‘‘ఫిర్ లే ఆయా దిల్’’ లాంటి పాటలు విననివారు తక్కువే. ఈ అందమైన పాటల వెనక ఒకే గొంతు ఉంది — అరిజిత్ సింగ్. బాలీవుడ్ ప్రేమ పాటలకు ఆత్మలా మారిన అరిజిత్ ఇప్పుడు కోట్లాది మందికి ప్రియమైన గాయకుడు. ఏ సినిమా అయినా అరిజిత్ పాట ఉంటే చాలు అని డైరెక్టర్లు అనుకుంటారు. ఎలాంటి మూడ్‌లో అయినా ఆయన పాటలు వినడం అలవాటుగా మారిపోయింది.
ఇటీవల రాహుల్ వైద్య ఇచ్చిన ఇంటర్వ్యూలో అరిజిత్ కన్సర్ట్ ఫీజు గురించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అరిజిత్ సింగ్ రెండు గంటల లైవ్ షో కోసం రూ. 14 కోట్లు తీసుకుంటాడట! ఇది ఆయనను ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా టాప్ హయ్యెస్ట్ పేడ్ సింగర్స్‌లో ఒకరిగా నిలిపింది.
అరిజిత్ జీవితం సాధారణమైనా, విజయ పరంపర మాత్రం గ్రాండ్‌గా ఉంది. ఆయన నెట్‌వర్త్ సుమారు రూ. 414 కోట్లు. నవీ ముంబైలో రూ. 8 కోట్ల విలువైన విల్లా, రూ. 3.4 కోట్ల విలువైన లగ్జరీ కార్లు (రేంజ్ రోవర్, మెర్సిడెస్) ఉన్నాయి. కోకా-కోలా, సామ్‌సంగ్ వంటి బ్రాండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ కూడా. అయినా లైమ్‌లైట్‌కి దూరంగా ఉంటాడు.
రాహుల్ వైద్య చెప్పిన మరిచిపోలేని సంఘటనలో ఒకటి — ఓ షో అయిపోయిన తర్వాత అరిజిత్ కార్ ఆలస్యం కావడంతో ఆటోలో ఇంటికి వెళ్లాడట. ఇంకొకసారి ఓ పెళ్లిలో పాడేందుకు భారీ ఫీజు ఇచ్చారు, ఆ డబ్బుతో అరిజిత్ ముంబైలో డూప్లెక్స్ ఫ్లాట్ కొన్నాడు.