HomeTelugu Newsఅనుష్క 'నిశ్శబ్ధం' అప్టేడ్స్‌

అనుష్క ‘నిశ్శబ్ధం’ అప్టేడ్స్‌

7 4స్టార్‌ హీరోయిన్‌ అనుష్క నటిస్తున్నతాజా చిత్రం ‘నిశ్శబ్ధం’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలోని సీటెల్‌లో చిత్రీకరించారు. దీంతో సీటెల్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు నిర్మాత కోన వెంకట్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘మునివేళ్లపై నిలబెట్టే థ్రిల్లర్‌ కథాంశాన్ని ప్రేక్షకులకు చూపించే రోజు ఎప్పుడొస్తుందా? అని ఆసక్తితో ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్రీకరణలో భాగంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘నిశబ్ధం’ చిత్రానికి పంచ మంత్‌ మధుకర్‌ దర్శకుడు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu