HomeTelugu Trendingమాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: ట్రైలర్‌ ప్రోమో విడుదల

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: ట్రైలర్‌ ప్రోమో విడుదల

Nithiin macherla niyojakava

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటించిన తాజా చిత్రం ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మొద‌టి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్ష‌న్ చిత్రంలో న‌టించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి. ఈసినిమా ఆగ‌స్టు 12వ తేదీన విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వరుస‌గా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ ప్రేక్ష‌కుల‌లో ఆసక్తిని పెంచుతున్నారు.

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్ శ‌నివారం విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ట్రైల‌ర్‌కు స‌ర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఇక ఇటీవ‌లే విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచింది. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu