HomeTelugu Trending'మ్యాస్ట్రో' కొత్త పోస్టర్‌.. త్వరలో వచ్చేస్తున్నాడు

‘మ్యాస్ట్రో’ కొత్త పోస్టర్‌.. త్వరలో వచ్చేస్తున్నాడు

Nithiin Maestro songs wil

హీరో నితిన్‌, మేర్లపాక గాంధీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `మ్యాస్ట్రో`. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌ల పూర్త‌య్యింది. వచ్చే వారం నుండి మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభంకానుంద‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో నితిన్ బీచ్‌లో పియానో వాయిస్తూ క‌నిపించాడు. నితిన్‌ హిట్‌ మూవీ ‘భీష్మ’కు సంగీతం అందించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగర్ ఈ మ్యాస్ట్రో చిత్రానికి మ్యూజిక్‌ అందించాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను ఆశించొచ్చు.

ఇప్ప‌టికే నితిన్ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి మంచి స్పందన వ‌చ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ తుదిద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu