యంగ్ హీరో నితిన్ కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ‘రైడ్’, ‘వీరా’ మూవీలను తెరకెక్కించిన రమేశ్ వర్మతో కలిసి నితిన్ పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల ఛాయలు ఈ కొత్త చిత్రంలోనూ కనిపిస్తాయని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై హీరో హవీశ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం నితిన్.. ‘భీష్మ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలోనే తన కొత్త సినిమాల గురించి ప్రకటన చేస్తానని, అభిమానులు కాస్త ఓపిక పట్టాలని గతంలో నితిన్ కోరిన విషయం తెలిసిందే.












