HomeTelugu Trendingవరుణ్‌ తేజ్ 'వాల్మీకి' హీరో నితిన్‌!

వరుణ్‌ తేజ్ ‘వాల్మీకి’ హీరో నితిన్‌!

9 2డైరెక్టర్‌ హరీశ్ శంకర్ ‘వాల్మీకి’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ – తమిళ హీరో అధర్వ మురళి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే – అధర్వ మురళి సరసన మృణాళిని రవి నటించారు. తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’కి సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా ఈ నెల 13న విడుదల చేయాలని అనుకున్నా అదే రోజున గ్యాంగ్ లీడర్ రిలీజ్ కి ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో అతిధి పాత్రలో డైరెక్టర్ సుకుమార్‌ ఉన్నాడని హరీష్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో కథలో భాగంగా ఒక సినిమా హీరో ఉన్నాడు. సినిమా హీరోగా ఈ పాత్రను తమిళంలో విజయ్ సేతుపతి చేశాడు. తెలుగులో ఆ పాత్రను నితిన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆయనకి సంబంధించిన షూటింగును ఇటీవలే పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్ లో హిట్ కావడంతో ఇక్కడ కూడా సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu