Mega Hero Next Movies:
మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సాఫీస్ హిట్ కొట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ‘మట్కా’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలకు ముందే ప్రతికూల స్పందనతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా నమోదు చేయలేకపోయింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
In a game ruled by greed,
only blood can pay the price.
Witness the rise of a Vasu.🔥🔥🔥https://t.co/qs3czwc8du#Matkatrailer out now!#MATKAonNOV14th pic.twitter.com/6G1bcK9bsi— Varun Tej Konidela (@IAmVarunTej) November 2, 2024
వరుణ్ తేజ్ పై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఆయన కథల ఎంపిక, దర్శకుల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మించాల్సి ఉండగా, వారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. మెర్లపాక గాంధీ కూడా గత కొన్ని ఏళ్లుగా పెద్ద హిట్ అందుకోలేకపోయారు.
ఈ పరిస్థితుల్లో, ఈ సినిమా ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి తగ్గిపోతుందని.. ప్రమోషన్లలో గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, వరుణ్ తేజ్ తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్‌ను వాయిదా వేసి, కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
View this post on Instagram
ప్రస్తుతం వరుణ్ కొత్త కథల్ని వింటున్నారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు, విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మరో చిత్రానికి కూడా వరుణ్ సైన్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగడానికి సమయం తీసుకునేలాగా కనిపిస్తోంది.
ALSO READ: Bigg Boss 8 Telugu ఫస్ట్ ఫైనలిస్ట్ ఫిక్స్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుంది ఎవరంటే!