HomeTelugu NewsNithin-Nagachaithanya: డిసెంబర్ బరిలో ఆ ఇద్దరు హీరోలు!

Nithin-Nagachaithanya: డిసెంబర్ బరిలో ఆ ఇద్దరు హీరోలు!

Nitin Naga Chaitanya movies Nithin-Nagachaithanya,Nitin,Naga Chaitanya,december,Thandel,Robinhood

Nithin-Nagachaithanya: అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చందూ ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా దసరా, దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

అయితే తాజాగా వార్త ప్రకాం.. ఈ సినిమా దసరా, దీపావళి రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆ టైమ్‌లో రామ్ చరణ్, రజినీకాంత్, ఎన్టీఆర్ వంటి స్టార్‌ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. దీంతో .. ఈ మూవీని డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

Nithin-Nagachaithanya

ఈ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నారట. త్వరలోనే దీనిపై అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే అదే డేట్‌కు.. ‘రాబిన్ హుడ్’ కూడా విడుదల కాబోతుంది. నితిన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో మొదట ఈ సినిమాలో రష్మికని హీరోయిన్ గా ప్రకటించినా ఆమె తప్పుకోవడంతో వేరే హీరోయిన్ ని ఎవర్ని తీసుకున్నారు అనేది ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Nithin-Nagachaithanya

ఈ సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద నితిన్ వర్సెస్ నాగచైతన్య పోటీ కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరి హీరోలకు ఎంతో ముఖ్యమైనవి. ప్రస్తుతం వీరిద్దరూ ప్లాప్స్ లో ఉన్నారు. మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలతో వీరిద్దరూ హిట్స్ అందుకుంటారా లేదా చూడాలి. డిసెంబర్ లో ఇంకా ఏ భారీ సినిమాలు ప్రకటించలేదు. ఇది ఈ సినిమాలకు ప్లస్‌ అవుతుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu