ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు పీఎస్సీ బోస్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ‘సాహసపుత్రుడు’ సినిమాతో బోస్‌ నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హిందీలో ‘ప్రతిబంధ్‌’ సినిమాలో నటించారు. చిరంజీవి ‘కొదమ సింహం’ సినిమాలో కనిపించారు. సురేశ్‌బాబు ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘ప్రేమఖైదీ’ సినిమాలో విలన్‌ పాత్ర పోషించారు. దర్శకుడు కృష్ణవంశీ తొలి సినిమా ‘గులాబి’ (1995) నుంచి ‘డేంజర్‌’ (2005) వరకు దాదాపు ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ బోస్‌ కనిపించారు. పూరీ జగన్నాథ్‌, కృష్ణవంశీ, ఉత్తేజ్‌ తనకు మంచి స్నేహితులని బోస్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.