HomeTelugu Trendingఎక్స్‌ట్ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా నితిన్‌

ఎక్స్‌ట్ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా నితిన్‌

 

nitthin32 first look poster

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై అటు నితిన్‌, ఇటు వక్కంతం వంశీ ఇద్దరూ ఆశలు పెట్టుకన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి నితిన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజైంది.

ఈ సినిమాకు ఎక్స్‌ట్ట్రా ఆర్డినరీ మ్యాన్‌ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. దీంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. గుబురు గడ్డంతో నితిన్‌ లుక్‌ నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను డిసెంబర్‌ 23న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu