HomeTelugu Trendingచోర్ బజార్: నూనుగు మీసాల సాంగ్‌ను విడుదల చేసిన సమంత

చోర్ బజార్: నూనుగు మీసాల సాంగ్‌ను విడుదల చేసిన సమంత

Chor Bazaar

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్ బజార్’. గెహన సిప్పీ హీరోయిన్‌గా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న “చోర్ బజార్” నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని ‘నూనుగు మీసాల’ లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్‌ చేసింది.

హీరోయిన్ పాడుకునే సోలో సాంగ్ ఇది. ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు, అతని గురించి తానెంతగా ఎదురుచూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది. ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపర్చగా…కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. భాను కొరియోగ్రఫీ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu