వరుణ్‌ సందేశ్ ‘ఇందువదన’ ఫస్ట్‌లుక్‌


టాలీవుడ్‌లో హ్యాపీడేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్‌ సందేశ్‌. ఆ తరువాత పలు సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత ఈ యంగ్ వరుణ్‌ తేజ్‌ రీఎంట్రీ ఇచ్చాడు. అతడు నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఎం.ఎస్.ఆర్ దర్శకుడు. మాధవి ఆదుర్తి నిర్మాత.

తాజాగా హీరోయిన్‌ బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందువదనా టైటిల్ కి తగ్గట్టే ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా వరుణ్ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా పీరియాడిక్ ఎలివేషన్ తో తన అభిమానుల ముందుకు వస్తున్నాడు. క్లాసిక్ డేస్ కళాకారుడిలా శోభన్ బాబు రింగుతో అతడి రూపం మెస్మరైజ్ చేస్తోంది. పంచెకట్టు దోతీ.. మెడలో రుద్రాక్ష మాల కనిపిస్తున్నాడు. కౌగిలింతలో ప్రేమపక్షుల కుహకుహలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. సంథింగ్ ఈజ్ దేర్.. అంటూ ఎదురు చూసేలా ఈ లుక్ ని తీర్చిదిద్దిన తీరు ఆసక్తిని కలిగిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates