HomeTelugu Trendingఅన్నకు మాట సాయం చేయనున్న ఎన్టీఆర్‌!

అన్నకు మాట సాయం చేయనున్న ఎన్టీఆర్‌!

Ntr help for his brother

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసార’. ఈ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్న కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్న సినిమాకు ప్లస్ అయ్యేలా ఎన్టీఆర్ ఓ స్టెప్ తీసుకుంటున్నారట. ఇటీవలే ప్రకటించిన ‘బింబిసార’ మూవీలో ఎన్టీఆర్ కూడా భాగస్వామి కాబోతున్నారట.

‘బింబిసార’ సినిమాతో హిట్‌ కొట్టాలి అని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఎన్టీఆర్ క్రేజ్ యాడ్ చేస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. మరోవైపు ఎన్టీఆర్ సైతం ఎంత బిజీగా ఉన్నా అన్న కోసం రెడీ అన్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu