HomeTelugu Trendingఏప్రిల్‌2న గోపీచంద్‌ 'సీటీమార్‌'

ఏప్రిల్‌2న గోపీచంద్‌ ‘సీటీమార్‌’

Seetimaarr release date aహీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సీటీమార్’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.గోపీచంద్ ఈ దర్శకుడితో గతంలో ‘గౌతమ్ నంద’ సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమా ‘సిటిమార్’ రిలీజ్‌ డేని ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీన థియేటర్లలోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా తరువాత గోపీచంద్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని మారుతి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu