HomeTelugu Trendingఎన్టీఆర్‌ న్యూలుక్‌ వైరల్‌

ఎన్టీఆర్‌ న్యూలుక్‌ వైరల్‌

nter new look viral

జూనియర్‌ ఎన్టీఆర్‌- కొర‌టాల శివ కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కాగా ఈ ఇద్దరూ మరోసారి ఎన్టీఆర్ 30తో అలరించేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం ఎన్టీఆర్‌ తన మేకోవర్‌ మార్చుకుంటున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా సోషల్‌ మీడియాలో తారక్‌ న్యూ లుక్‌పై తెగ వైరల్‌ అవుతుంది. ఇది కొరటాల సినిమా కోసమే అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. జీన్స్‌, టీ షర్ట్‌, మ్యాచింగ్‌ షూస్‌తో బ్లాక్‌ గాగుల్స్‌ పెట్టుకుని స్టైలిష్‌గా కెమెరాకు ఫోజులిచ్చాడు ఎన్టీఆర్‌. ఈ మూవీ షూటింగ్ అప్‌డేట్‌ ఎప్పుడెప్పుడు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్‌ మరోవైపు కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ 31ను ప్రకటించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu