HomeTelugu Trendingరామ్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌- టైటిల్‌ విడుదల

రామ్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌- టైటిల్‌ విడుదల

Ram pothineni new movie tit

టాలీవుడ్‌ యంగ్ హీరో రామ్‌ పోతినేని.. తమిళ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి ఆది పినిశెట్టి విలన్‌గా చూపించనున్నాడు. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు మేకర్స్‌. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ది వారియర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.

ఈ టైటిల్‌తోపాటు రామ్‌ పోతినేని ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu