HomeTelugu Trendingఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ బహిరంగ లేఖ

ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ బహిరంగ లేఖ

Ntr open letter for his fan
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేడుకలకు ఇది సరైన సమయం కాదని.. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ నియమాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానని పేర్కొన్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌‌.. కొరటాలశివతో ఓ సినిమా పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu