హిట్‌-2: పోరాటమే.. పోరాటమే లిరికల్‌ సాంగ్‌ విడుదల


అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్ 2’. శైలేశ్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని నాని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘పోరాటమే .. పోరాటమే .. నీ జీవితం ఒక పోరాటమే’ అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

“రక్తమే అంటుకున్న చేతులా .. ఎంతకీ వదిలిపోని మరకలా .. నిదురలో పోనే పోనీ చేదు గురుతులా ” అంటూ ఈ పాట మొదలవుతోంది. పోలీస్ ఆఫీసర్ గా హీరో డ్యూటీకి సంబంధించిన విజువల్స్ పై వచ్చే పాట ఇది. సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. దర్శకుడు శైలేశ్ కొలను .. నిర్మాత ప్రశాంతి కలిసి ఈ పాటను ఆలపించడం విశేషం. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. రావు రమేశ్ .. పోసాని .. కోమలి ప్రసాద్ తదితర పాత్రల్లో కనిపించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates