HomeTelugu Trending'ఆర్‌. ఆర్‌.ఆర్‌' సెట్‌లో రాజమౌళి.. ఎన్టీఆర్‌ కామెంట్‌

‘ఆర్‌. ఆర్‌.ఆర్‌’ సెట్‌లో రాజమౌళి.. ఎన్టీఆర్‌ కామెంట్‌

8 26

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ తార అలియాభట్‌ నటించనున్నారు. ప్రస్తుతం బల్గేరియాలో ఎన్టీఆర్‌ మీద పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఫొటోను తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎన్టీఆర్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘తుఫాన్‌కు ముందు ప్రశాంతత లాంటి మనిషి’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu