HomeTelugu Trending'తమ్ముడు' గా అఖిల్‌!

‘తమ్ముడు’ గా అఖిల్‌!

Akhil movie with venu srira

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఆయన మూవీ టైటిల్‌తో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అయితే త్వరలో అక్కినేని వారసుడు అఖిల్ తన నెక్స్ట్ మూవీ పవన్‌ ‘తమ్ముడు’ టైటిల్‌తో చేయనున్నట్టు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

పవన్ హీరోగా 1999లో వచ్చిన ‘తమ్ముడు’ ఆయన కెరియర్ లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వేణు శ్రీరామ్ రూపొందిస్తున్న ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అఖిల్ తాజా చిత్రమైన ‘ఏజెంట్’ విడుదల తరువాత ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu