HomeTelugu Trendingకంగనా సినిమాలో తారక్‌!

కంగనా సినిమాలో తారక్‌!

11 14బాలీవుడ్ లో వచ్చినట్టుగానే సౌత్ సినిమాలో కూడా బయోపిక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. సావిత్రి బయోపిక్ మంచి
విజయాన్ని సొంతం చేసుకుంది. సావిత్రి బయోపిక్ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీశారు. పర్వాలేదనిపించింది. ఇప్పుడు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. సినిమాపై అంచనాలు భారీగా
ఉన్నాయి.

జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తుండగా, కరుణానిధి పాత్రలో ప్రకాష్
చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ పాత్రలో ఎవరు చేయబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. జయలలిత
ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేసింది. సినిమాతో పాటు రాజకీయంగా కూడా ఈ ఇద్దరి మధ్య ఎన్నో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu