Homeపొలిటికల్ఎన్టీఆర్ ప్రెజెన్సీ టీడీపీ గెలుపుకు పునాది !

ఎన్టీఆర్ ప్రెజెన్సీ టీడీపీ గెలుపుకు పునాది !

NTRs presence is the foundation of TDPs victory

2024 సార్వత్రిక ఎన్నికలు అందరికీ ఓ సవాల్. ఇటు చంద్రబాబు నాయుడు గారికీ, అటు జగన్ గారికీ కూడా. ఎందుకంటే ఈ సారి 175 స్థానాలు మేమే గెలుస్తామని జగన్ గారు, పార్టీ నాయకులూ ధీమాగా ఉన్నారు. ఇది ఎన్నికల ఎత్తుగడ కావచ్చు. ఈ ప్రచారం సామాన్యులను ప్రభావితం చేస్తుందని వ్యూహ కర్తల ఆలోచన అయ్యి ఉండొచ్చు. కానీ, వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. జగన్ రెడ్డికి బటన్ల నొక్కడం తప్ప, మరో పని చేతకాదు అని జనానికి అర్ధం అయిపోయింది. జగన్ రెడ్డి మాత్రం తన సంక్షేమ పథకాలు, తన వాలంటీర్ వ్యవస్థ తనను గెలిపిస్తాయని గుడ్డిగా నమ్ముతున్నాడు. గుడ్డి కన్నుతో లోకాన్ని చూస్తున్న మాదిరిగా ప్రస్తుత జగన్ పరిస్థితి ఉంది.

మరోవైపు వైకాపా పాలనపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందని తెదేపా అధినేత నమ్ముతున్నారు. దీనికితోడు పవన్ కళ్యాణ్ తో పొత్తులు కూడా ఉపకరిస్తాయని అంచనా ఉంది. అయితే ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తే గెలవచ్చు.. స్థానిక ఎన్నికల ద్వారా వైకాపా నిరూపించింది. అదే సూత్రం వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తే.. దాన్ని ధీటుగా తట్టుకుని నిలబడే వ్యూహాన్ని టీడీపీ వేయాలి. అన్నిటికీ మించి పోలింగ్ ముందు రోజు ఎవరెంత ఇస్తారు అనే అంశం కూడా గెలుపోటములను నిర్ణయిస్తుంది. కాబట్టి.. అందుకు అనుగుణంగా టీడీపీ సిద్ధం అవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా జనం నాడి ఏమిటి అనేది ఎన్నికలు దగ్గర పడితే తెలుస్తుంది.

కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఒకరోజు చేపను ఇవ్వటం కాదు. చేపను పట్టటం నేర్పించే నాయకుడి వల్లే తమ పిల్లల భవిష్యత్తు బాగు పడుతుంది అని వారు ఆలోచించుకోవాలి. ప్రతి ఇంటికి వారసులు ఉంటారు. కాబట్టి ఓటు వేసే ముందు తమ వారసులు ఎలా ఉండాలి ? అని ఆలోచించుకుని ఓటు వేయాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే.. రాష్ట్రానికి ముందు పరిశ్రమలు రావాలి. రావాలంటే.. ముందు రాష్ట్రానికి రాజధాని ఏది అని తేలాలి. రాజధాని అంటే, చిన్న పిల్లల ఆట కాదు. రాష్ట్రానికి భౌగోళికంగా మధ్యన ఉండాలి అన్న అనుభవజ్ఞుల మాట పాటించే మనిషి ఈ సారి ముఖ్యమంత్రి అవ్వాలి.

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ఎవరు చేయగలరో వారు ముఖ్యమంత్రి అవ్వటం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అత్యవసరం. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిక్కచ్చిగా అమలు చేస్తానని తన తల్లిదండ్రుల పై ప్రమాణం చేసిన వారిని ముఖ్యమంత్రిగా చేయాలి. ఈ విషయాలను ఆంధ్ర ప్రజలు ఈసారి ఓటు వేసే ముందు దృష్టిలో పెట్టుకుంటే వారికే మేలు జరుగుతుంది. అయినా, 2019 కి ముందు ఎన్నో వర్గాలు జగన్ గారికి మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు అందులో చాలా వర్గాలు దూరం అయ్యాయి. అందువల్ల ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావడం కష్టమే.

ఐతే, టీడీపీ గెలుపు ‘నల్లేరు మీద బండి నడక ‘ కాదు. నిజమే చంద్రబాబు నాయుడు గారి సభలకు, లోకేశ్ గారి పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ, వైకాపా వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అన్నిటికీ మించి వైకాపా బలాన్ని, ఎన్నికల వ్యూహాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. బాబుకి ఇప్పుడు కంటెంట్ ఉన్న వ్యక్తులతో పాటు కటౌట్ ఉన్న వ్యక్తులు కూడా కావాలి. జూ.ఎన్టీఆర్ లాంటి వారిని బాబు మళ్లీ తమలో కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. కచ్చితంగా ఎన్టీఆర్ ప్రెజెన్సీ టీడీపీ గెలుపుకు పునాది అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu