Homeపొలిటికల్పవన్ సంగతి సరే.. మన ఇంట్లో ఎన్ని పెళ్లిళ్లు జగన్ రెడ్డి ?

పవన్ సంగతి సరే.. మన ఇంట్లో ఎన్ని పెళ్లిళ్లు జగన్ రెడ్డి ?

Pawans matter is ok.. How many marriages in our house Jagan Reddy

మూడు రాజధానుల వల్ల మేలు జరుగుతుందని తానంటే.. మూడు పెళ్లిళ్ల వల్ల మేలు జరుగుతుందని వారంటున్నారంటూ ఆ మధ్య ఓ సభలో జగన్ రెడ్డి తెగ ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని విషయాలు వదిలేసి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడటం.. ఆయన పెళ్లిళ్ల వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతుందని జగన్ బాధపడటం చూసి … సభలోని వారే ఆశ్చర్యపోయారు. పవన్ పెళ్లిళ్ల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏ తీరని నష్టం జరగలేదు. కానీ జగన్ మాటలు మాత్రం గత కొన్ని ఏళ్లుగా ఆ పెళ్లిళ్ల చుట్టే సాగుతున్నాయి. దీనికితోడు మిగిలిన వైసీపీ నేతలు కూడా పదే పదే పవన్ మూడు పెళ్లిళ్లనే టార్గెట్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై మూడు పెళ్లిళ్ల వివాదం దుమారం రేపుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మూడు పెళ్లిళ్ల వివాదం హాట్ టాపిక్ అయింది.

మొన్నటి వరకు ఇదే అంశంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతాడు ?, తన పార్టీకి చెందన ఎమ్మెల్యే చుట్టూ మూడు పెళ్లిళ్ల వివాదం ముసురుకుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం చేశాడని సాక్ష్యాలు చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. కానీ, పవన్ కళ్యాణ్ ఏమీ జగన్ రెడ్డి ఎమ్మెల్యే లా ఎవర్ని మోసం చేయలేదే ?. చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరి ఇప్పుడు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు ?. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మన వ్యవస్థ ఏమైపోవాలని జగన్ తెగ బాధపడ్డాడు కదా… ?. మరి తన ఎమ్మెల్యే చేతిలో మోసగింప బడ్డ ఓ ఆడపడుచుకు జగన్ ఏం సమాధానం చెబుతాడు ?. అందరూ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే అక్క చెల్లెళ్ల మాన ప్రాణాలు ఏమైపోవాలని జగన్ సినిమా డైలాగ్ లు కొట్టాడు కదా. మరీ ఇప్పుడేం డైలాగ్ లు చెబుతాడు.

జగన్ రెడ్డి ఏం చెప్పడు. అసలు జగన్ స్వభావం తెలిసిన ఏ ఆడకూతురు జగన్ నుంచి ఏం ఆశించడు. సొంత చెల్లినే బ్లాక్ మెయిల్ చేసిన హిస్టరీ జగనన్న ది. ఇక సొంత బాబాయ్ చనిపోతే.. న్యాయం చేయి అన్నయ్య అని వచ్చిన చిన్నాన్న కూతుర్ని బెదిరించిన నీచపు మనస్తత్వం జగన్ ది. ఇలాంటి నాయకుడా మన రాష్ట్రానికి దశా దిశా చూపేది ?. అయినా ‘వైసీపీ గూండాలు ఆగరు. వాళ్లకు రాష్ట్ర అభివృద్ధి కన్నా.. పవన్ మూడు పెళ్లిళ్ళ ముచ్చటే కావాలి. మళ్లీ తమలో రోత పుట్టించే బూతు నాయకులు ఉన్నా.. వాళ్ళను ఏం అనరు. ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన వారిలో బొక్కలు మాత్రం భలే వెతుకుతారు.

అయినా అనకూడదు గానీ, అసలు జగన్ రెడ్డికి పవన్ పెళ్లిళ్ల పై మాట్లాడే అర్హతే లేదు. మన ఇంటిని శుభ్ర పరిచాకే.. పక్క ఇంటి వైపు చూడాలి జగన్. ఏ.. ?, మన ఇంట్లో చెల్లికి ఎన్ని పెళ్లిళ్లు ? అని ఎదురింటి వారు ప్రశ్నస్తే.. ఏం సమాధానం చెబుతావ్ జగన్ రెడ్డి ?, చెల్లి ప్రేమ కోసం ఆమె మొదటి మొగుణ్ణి చంపి, ఆమెకు రెండో పెళ్లి చేశారా ? అని శత్రువులు నిలదీస్తే.. ఏం మాట్లాడగలవ్ జగన్ రెడ్డి ?. దీనికితోడు రెండో మొగుడు కూడా చాలక, ఇంకోక వ్యక్తితో కూడా చెల్లికి అక్రమ సంబంధం అట కదా అంటే ?.. ఏం వివరణ ఇవ్వగలవ్ జగన్ రెడ్డి ?. దీనికితోడు ఇప్పుడు తన పార్టీ ఎమ్యెల్యే మూడు పెళ్లిళ్ల బాగోతం కంపు కొడుతోంది. అసలు ఇంట్లోనే ఇంత దరిద్రం పెట్టుకుని ఊర్లో వాళ్ళకి సుద్దులు చెప్పేంత నీతి, నిజాయితీ నీకు ఎందుకు జగన్ రెడ్డి ?. ఈ రోజుతోటి.. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల పై మాట్లాడితే అర్హత నువ్వు పూర్తిగా కోల్పోయావ్ జగన్ రెడ్డి. ఇంకెప్పుడైనా పవన్ 3 పెళ్లిళ్లు అంటూ దీర్ఘం తీశావో.. జనమే నీ ఇంట్లో నీ పార్టీలో పెళ్లిళ్ల పురాణాన్ని అడుగుతారు జాగ్రత్త.

Recent Articles English

Gallery

Recent Articles Telugu