HomeTelugu Trending"ఓ మంచి రోజు చూసి చెప్తా" ట్రైలర్‌

“ఓ మంచి రోజు చూసి చెప్తా” ట్రైలర్‌

O Manchi Roju Chusi Chepta
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, మెగా డాటర్‌ నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై హిట్‌ కొట్టిన తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. ఈ చిత్రం తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్‌తో రిలీజ్‌ అవుతోంది. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయింది.

“ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికే హైలైట్. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సెన్సార్ సభ్యులు సినిమా అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారు” అని నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి అన్నారు. కాగా చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి తర్వాత విడుదల అవుతున్న నిహారిక మొదటి చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu