చరణ్ నన్ను చంపేస్తున్నాడు: ఉపాసన

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తన వ్యక్తిగత విషయాలను నెటిజన్లతో తరచూ పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ‌చరణ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లను, ఆయన సినిమా ప్రచార చిత్రాలను కూడా షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఆమె తన ప్రియమైన భర్త‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘రుచికరమైన వంటలు తినిపిస్తాడు (లవ్‌ ఎమోజీ).. తర్వాత జిమ్‌కు తీసుకెళ్లి చంపుతాడు (ఏడుస్తున్న ఎమోజీ). ‘మిస్టర్‌ సి’తో అద్భుతమైన ఆదివారం’ అని ఉపాసన పేర్కొన్నారు. దీంతోపాటు చరణ్‌ తినిపిస్తున్న ఫొటో, జిమ్‌కు తీసుకెళ్తున్న ఫొటోలను షేర్‌ చేశారు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం యూరప్‌లోని అజర్‌ బైజాన్‌లో జరుగుతోంది. అక్కడ కొన్ని యాక్షన్‌ ఘట్టాలతో పాటు, సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. భర్త కోసం ఉపాసన కూడా అక్కడికి వెళ్లారు.