ఐటెమ్ సాంగ్ కు సోనాక్షి అంగీకరిస్తుందా..?

సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో సినిమాలు అందులో వచ్చే ఐటెమ్ సాంగ్స్ ఎంత ప్రత్యేకంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సుకుమార్ ఐటెమ్ సాంగ్ ను డిజైన్ చేస్తే.. దానికి తగ్గ ట్యూన్ ఇచ్చి ఆ పాటను మరో స్థాయికి తీసుకెళతాడు దేవిశ్రీప్రసాద్. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న ‘రంగస్థలం’ సినిమాలో కూడా ఐటెమ్ సాంగ్ ప్రత్యేకంగా ఉండబోతుంది. 1950లలో సాగే ప్రేమకథ ఇందులో ఐటెమ్ సాంగ్ ఏంటి అనుకుంటున్నారా..? అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగానే ఈ పాటను డిజైన్ చేస్తున్నారట.
అప్పట్లో భోగమేళం పేరుతో నిర్వహించే నృత్య విన్యాసలను దృష్టిలో పెట్టుకొని సుకుమార్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం సోనాక్షి సిన్హాను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. సోనాక్షిని తెలుగులోకి తీసుకురావాలని మెగాక్యాంప్ ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది. ఉయ్యాలవాడ కోసం కూడా ఆమెను సంప్రదించారు. ఇప్పుడేమో ఐటెమ్ సాంగ్ అంటూ ఆమె దగ్గరకు వెళ్లబోతున్నారు. మరి దీనికి సోనాక్షి అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి. ఆమె గనుక నో చెబితే మరో బాలీవుడ్ అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు.