HomeTelugu Trendingఓజీ గ్లింప్స్‌ విడుదల

ఓజీ గ్లింప్స్‌ విడుదల

OG Glimpse

టాలీవుడ్‌ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. సుజిత్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. వారి ఉత్కంఠకు తెరదించుతూ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. నేడు పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓజీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మ‌ట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు న‌రికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగకలేకపోయింది. ఇట్ వాస్ ఏ ఫ్రీకింగ్ బ్ల‌డ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే.. సాలా షైతాన్ అజాయేగా అంటూ’ బ్యాక్ గ్రౌండ్‌లో చెబుతున్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్‌ సాగింది. కాగా పవన్‌ పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ చెబుతూ విడుద‌ల చేసిన ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా స్ట‌యిలిష్ లుక్‌లో కొత్త‌గా కనిపిస్తున్నాడు.

ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్‌ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా‌.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఓజీలో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్‌ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారు. ఓజీలో పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చెబుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!