HomeTelugu Big Storiesఓ బేబీ ఎంత రాబట్టిందో తెలుసా!

ఓ బేబీ ఎంత రాబట్టిందో తెలుసా!

3 8

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. ఈ మూవీ తొలి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.17 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా సామ్‌ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ‘అద్భుతమైన వీకెండ్‌. బేబీపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఆనందంలో వెనక్కి గెంతులేస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ఈ సినిమా అమెరికాలోనూ సత్తాచాటింది. మూడు రోజుల్లో 5 లక్షల డాలర్లకుపైగా రాబట్టింది. ఈ చిత్రం అక్కడ ప్రీమియర్స్‌లో (గురువారం) 1,45,637 డాలర్లు, తొలి రోజున (శుక్రవారం) 1,53,120 డాలర్లు, శనివారం 1,55,276 డాలర్లు, ఆదివారం 45,972 డాలర్లు (మధ్యాహ్నం 12 గంటలలోపు షోల వసూళ్లు) వసూలు చేసినట్లు యూనిట్‌ పేర్కొంది.

ఓ బేబీ ‘సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. సమంతను అభినందిస్తూ పుష్పగుచ్ఛం పంపారు. దీంతోపాటు ఓ మొక్కను కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా సామ్‌ బన్నీకి ధన్యవాదాలు చెప్పారు. దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాత సునితను బన్నీ కలిశారు. ఈ మేరకు ఆయనతో కలిసి దిగిన ఫొటోను నందిని రెడ్డి షేర్‌ చేస్తూ.. ‘నాలో స్ఫూర్తి నింపి, నేనింకా మంచి సినిమాలు తీయగలనని నమ్మినందుకు అల్లు అర్జున్‌కు థాంక్స్‌. మీరు ‘ఓ బేబీ’ గురించి చెప్పిన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కల్గించాయి. మీరు ది బెస్ట్‌ బన్నీ’ అని ట్వీట్‌ చేశారు.

3a

Recent Articles English

Gallery

Recent Articles Telugu